మీ పిల్లలు ఇష్టంగా పాలు తాగడం లేదా.. ఈ చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలకు చెక్!

పాలు బలవర్థకమైన ఆహారం అనే సంగతి తెలిసిందే. పిల్లలు పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పిల్లలు తల్లిపాలు తాగడం ద్వారా వాళ్లకు అవసరమైన పోషకాలు అందే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే కొంతమంది పిల్లలు మాత్రం ఎదిగే కొద్దీ పాలు తాగడానికి ఎక్కువగా ఆసక్తి చూపించరు. అయితే పిల్లలకు పాలను రుచికరంగా అందించడం ద్వారా పిల్లలు సైతం పాలను ఇష్టంగా తాగే అవకాశం ఉంటుంది.

వేర్వేరు పండ్లతో స్మూతీలు, మిల్క్ షేక్స్ తయారు చేసి పిల్లలకు అందించడం ద్వారా పిల్లలు పాలను ఇష్టంగా తీసుకుంటారు. పాల పరిమాణం ఎక్కువగా పండ్ల పరిమాణం తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు తీసుకునే పాలలో చక్కెర మరీ ఎక్కువగా వేయదం కూడా వాళ్ల ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పవచ్చు. పిల్లలకు ఎక్కువ చక్కెర వేసిన పాలను ఇస్తే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.

బాదం, పిస్తా, కుంకుమపువ్వు, చాక్లెట్ వేసి పాలను పిల్లలకు ఇస్తే మంచిది. వెన్నతో కూడిన పాలను పిల్లలకు ఇస్తే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. వెన్నను క్రమంగా తగ్గిస్తూ పిల్లలకు పాలను ఇవ్వడం ద్వారా పిల్లలు వెన్న తొలగించిన పాలను సైతం ఇష్టంగా తాగే అవకాశాలు అయితే ఉంటాయి. పిల్లలకు కార్న్ ఫ్లేక్స్, చాకోస్ ను పాలలో కలిపి అందించడం మంచిదని చెప్పవచ్చు.

పాలతో తయారు చేసిన స్వీట్లను పిల్లలకు అందించడం ద్వారా బెనిఫిట్ కలుగుతుంది. స్వీట్ల రూపంలో పిల్లలకు పాలు అందించడం ద్వారా పిల్లలు బెనిఫిట్స్ ను పొందవచ్చు. పాలతో చేసిన ఐస్ క్రీమ్స్ ను పిల్లలు తీసుకోవడం ద్వారా పిల్లలకు పరోక్షంగా బెనిఫిట్ కలుగుతుంది. పిల్లలు పాలు తీసుకోవడం ద్వారా సులభంగా ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.