కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఒకటైన పీఎం సూర్యఘర్ స్కీమ్ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి కప్పులపై రూఫ్ టాప్ సోలార్ పానెల్స్ ను ఏర్పాటు చేసుకోవాలని భావించే వాళ్లకు విద్యుత్ సబ్సిడీ పొందడానికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్రం ఈ స్కీమ్ కోసం ఏకంగా 75 వేల కోట్ల రూపాయలకు పైగా విడుదల చేయడం గమనార్హం.
మూడు కిలోవాట్ల సౌర విద్యుదుత్పత్తికి 1,45,000 రూపాయలు ఖర్చు అవుతుండగా కేంద్రం నుంచి 78 వేల రూపాయల వరకు రాయితీ పొందే అవకాశం అయితే ఉంటుంది. మిగతా మొత్తం బ్యాంకు నుంచి రుణం పొందే అవకాశం ఉండటంతో ఈ స్కీమ్ కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ విధంగా సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసుకుని మిగిలిన 600 యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా అమ్ముకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా నెలకు 1265 రూపాయల ఆదాయం సులువుగా పొందే అవకాశం అయితే ఉంటుంది. 1 కిలోవాట్ కు 30 వేల రూపాయలు, 2 కిలో వాట్ కు 60 వేల రూపాయల వరకు గరిష్ట రాయితీ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
నెలకు 150 నుంచి 300 యూనిట్ల విద్యుత్ ను వినియోగించే వాళ్లు 2 లేదా 3 కిలోవాట్ సామర్థ్యం కలిగిన ప్లాంట్ ను ఏర్పాటు చేసుకుని సబ్సిడీ పొందవచ్చు. ప్రతి జిల్లాలో ఒక సౌర నమూనా గ్రామాన్ని ఏర్పాటు చేసి దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం. సూర్యఘర్ పోర్టల్ లో ఈ స్కీమ్ కోసం రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.