మనలో చాలామంది టీ, కాఫీలకు అడిక్ట్ అయ్యి ఉంటారు. ఒక నెల పాటు టీ లేదా కాఫీ తాగడం మానేస్తే, శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. టీ లేదా కాఫీ తాగడం మానేస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెప్పవచ్చు. టీ, కాఫీ మానేస్తే బరువు తగ్గడానికి దోహదపడుతుందని చెప్పవచ్చు. టీ, కాఫీ ఎవరైతే మానేస్తారో వారిలో బీపీ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని చెప్పవచ్చు.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారి టీ, కాఫీ మానేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మానసిక ఆరోగ్యాన్ని నియంత్రించడంలో టీ, కాఫీ మానేయడం సహాయపడుతుంది. శక్తి కోసం కెఫిన్‌పై ఆధారపడటాన్ని టీ, కాఫీ మానేయడం ద్వారా సులువుగానే తగ్గించుకోవచ్చు. డీ హైడ్రేషన్ సమస్య బారిన పడకుండా చేయడం టీ, కాఫీ తోడ్పడతాయి.
టీ, కాఫీలో ఉండే కెఫిన్ అనేక సమస్యలను తెచ్చి పెడుతుందని చెప్పవచ్చు. అందుకే, ఈ పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలిగే ఛాన్స్ ఉంటుంది. తలనొప్పి, అలసట, శక్తి/చురుకుదనం తగ్గడం, మగత, సంతృప్తి తగ్గడం, నిరాశ చెందిన మానసిక స్థితి, ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది, చిరాకు, స్పష్టమైన చూపులేకపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
టీ లేదా కాఫీ ఒక నెల పాటు తీసుకోకపోతే, అది శరీరంలో అనేక మార్పులకు కారణమవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. వీటికి దూరంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు హాయిగా నిద్రపోవచ్చని చెప్పవచ్చు.