ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం హృదయ సంబంధింత మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా 85 శాతం మరణాలు గుండెపోటు, స్ట్రోక్‌ల కారణంగానే సంభవిస్తున్నాయి. గుండె, రక్త నాళాల లోపాలు, కొరోనరీ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాస్కులర్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ సమస్యల వల్ల చాలామంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అధిక రక్తపోటు, డయాబెటిస్ మెల్లిటస్, అధిక కొలెస్ట్రాల్, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వ్యాయామం లేకపోవడం వంటివి గుండె జబ్బులకు కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. బ్లూబెర్రీస్, దానిమ్మ పండ్లు, వాల్‌నట్స్, చేపలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు.
తృణధాన్యాలు, చిక్కుళ్ళు, కూరగాయలు, పండ్లు, ఆలివ్ నూనె వంటి మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ కలిగిన మెడిటరేనియన్ ఆహారం, వారానికి ఒకసారి చేపలు లేదా పౌల్ట్రీ చికెన్ వంటివి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి. మన శరీరానికి ప్రతిరోజూ కొంత మొత్తంలో కొలెస్ట్రాల్ అవసరం అవుతుందని చెప్పవచ్చు.
ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తప్పనిసరిగా నివారించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కూల్ డ్రింక్స్ వంటి అధిక చక్కెర ఆహారాలు కూడా గుండెకు హానికరం అని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. ప్రాసెస్ చేయని ఆహారం లేదంటే నేచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉండదు.