మనిషికి ఆహారం కావాలి. అలా అని.. ఏది పడితే అది.. ఎప్పుడు పడితే అది తినకూడదు. మారిన జీవన పరిస్థితులు కూడా ఇందుకు కారణం. పగలంతా రకరకాల ఫుడ్స్ తింటాం. జీర్ణక్రియ బాగానే జరుగుతుంది. కానీ.. రాత్రిళ్లు మాత్రం జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఈ సమయంలో తీసుకునే ఫుడ్ లో జాగ్రత్తలు తప్పనిసరి. లేదంటే జీర్ణక్రియ మీద మాత్రమే కాదు.. నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. మొత్తంగా రాత్రిళ్లు 8లోపే భోజనం పూర్తి చేసేయాలి. డిన్నర్‌కు ముందు క్లియర్ సూప్ తీసుకోవడం వల్ల పొట్ట బరువుగా, నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకుంటాం. ఇందులో హెల్దీ ఆక్సిడెంట్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. క్యాప్సికంలో క్యాలరీలు తక్కువగా ఉండాలి.
సూప్స్ ఆరోగ్యానికి మంచింది. చిక్కగా కంటే.. పలచగా ఉండాలి. రకరకాల కూరగాయలతో చేసే సూప్స్ ఆరోగ్యానికి మంచిది. శరీరాన్ని ఉల్లాసాన్ని ఇస్తాయి. తీసుకునే ఫుడ్ లో మసాలా కంటే చిల్లీస్ లేదా పెప్పర్స్ వాడకం ఆరోగ్యానికి మంచిది. అలాగే గ్రీన్ బీన్స్‌ను సలాడ్స్‌లో వేసుకోవడం, సూప్ చేసుకుని తీసుకోవడం లేదా కూర చేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది. ఇవి శరీరానికి చాలా తక్కువ క్యాలరీలు అందేలా చేస్తుంది. కడుపు నిండినా ఉదయం పూట అనిపించినట్టు రాత్రిపూట భారీగా అనిపించదు. ఆహారం లైట్ అవుతుంది. నిద్ర బాగా పట్టేందుకు అవకాశం ఉంటుంది.
రాత్రిళ్లు ఫ్యాట్ మెటబాలిజం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి.. రాత్రి చేసే భోజనంలో గ్రీన్ వెజిటేబుల్స్‌కు ప్రాధాన్యత ఇస్తే మంచిది. బ్రొకోలీ చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. అనేక యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. రాత్రి భోజనానికి చాలా ఆరోగ్యకరమైనది. ఇలా రాత్రి తీసుకునే ఆహారం త్వరగా.. సులభంగా డైజెస్ట్ అయ్యేలా ఉంటే ఆరోగ్యానికి మంచిది. మంచి భోజనం, శక్తినిచ్చే భోజనం తక్కువగా, త్వరగా చేసి మంచి నిద్ర పడితే అంతకంటే కావలిసిందేం ఉంటుంది.
గమనిక: ఈ వివరాలన్నీ ఆరోగ్య నిపుణులు ఆయా సందర్భాల్లో సూచించినవే ఇవ్వడం జరిగింది. కేవలం మ అవగాహన కోసమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా, సమస్య నివృత్తికైనా డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమం. గమనించగలరు.