బలపాలు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే.. బలపాలు తింటే ఆ సమస్యలు దూరమా?

మనలో చాలామంది బలపాలను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ అలవాటు మంచి అలవాటు కాదని తెలిసినా కొంతమంది ఆర్డర్ చేసుకుని మరీ బలపాలను తినడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. చిన్నపిల్లలు బలపాలు తినడం ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతారు. బలపాలు ఎక్కువగా తింటే కడుపునొప్పితో పాటు రక్తహీనత సమస్య వేధించే అవకాశం ఉంటుంది. ఒకటి రెండు తింటే ఏం కాదు కానీ ఎక్కువగా తింటే యూరిన్ సమస్యలు వస్తాయి.

బలపాలు తినడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ సమస్య కూడా వేధించే అవకాశం ఉంటుంది. అయితే బలపాలు తినడం వల్లే అన్నీ నష్టాలే కాదు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అయితే సాధారణ బలపాలు తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉండవు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన విద్యార్థులు పోషక విలువలతో ఉన్న బలపాలను తయారు చేశారు. ఈ బలపాలను తినడం వల్ల అదిరిపోయే లాభాలను పొందవచ్చు.

బలపాలు తినే అలవాటు ఉన్నవాళ్లు ఈ బలపాలను తింటే సాధారణ బలపాలను తింటే ఎలాంటి రుచి ఉంటుందో అలాంటి రుచి ఉంటుంది. అదే సమయంలో తినడం వల్ల శరీరానికి లాభం కలుగుతుంది తప్ప ఎలాంటి నష్టం కలగదు. ఈ పిల్లల ప్రయోగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గమనార్హం. డిసార్డర్ అఫ్ ఈటింగ్ స్లేట్ పెన్సిల్ మోడల్ ఎంతోమంది తల్లీదండ్రుల టెన్షన్ కు చెక్ పెట్టింది.

ఈ బలపం రాయడానికి కూడ వీలుగా ఉండటంతో పిల్లలు ఈ బలపాన్ని వాడటానికి ఎంతో ఇష్టం చూపుతారు. నువ్వుల పొడి, పల్లీల పొడి, బియ్యం పిండి, చక్కర, బెల్లం ఉపయోగించి ఈ బలపాలను తయారు చేశారని తెలుస్తోంది. చిన్నారుల సమస్యలను తీర్చడానికి ఈ బలపాలను తయారు చేశామని విద్యార్థినులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ బలపాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.