ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని ఒళ్లునొప్పులు వేధిస్తున్నాయి. కొంతమంది ఈ నొప్పులను భరించలేక పెయిన్ కిల్లర్స్ పై ఆధారపడుతుంటారు. జీవన శైలి సరిగ్గా లేకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం ఇతర కారణాల వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువగా చాలామందిని వేధిస్తాయనే సంగతి తెలిసిందే. ఒళ్లు నొప్పులు, కాళ్ల నొప్పులకు చాలామంది టాబ్లెట్స్ పై ఆధారపడుతూ ఉంటారు.
అయితే టాబ్లెట్స్ వాడటానికి బదులుగా ఇతర చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు పసుపు, వేడిపాలు తీసుకుంటే ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపు యాంటీబయాటిక్ గా పని చేసి సులువుగా ఒళ్లునొప్పులను తగ్గిస్తుంది. అల్లం తీసుకోవడం ద్వారా కూడా ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం పొందే ఛాన్స్ ఉంటుంది.
అల్లం మొక్కను నీళ్లలో వేసి బాగా మరిగించి ఆ నీళ్లను తేనెలో కలుపుకొని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ సైతం ఒళ్లు నొప్పులను తగ్గించుకోవడంలో తోడ్పడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్న యాపిల్ సైడర్ వెనిగర్ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు. ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్లు బెల్లాన్ని తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడి కాస్త నొప్పులు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.
ఆవనూనెలో నాలుగు లవంగాలు, వెల్లుల్లి వేసి మరిగించి, అది గోరువెచ్చగా ఉన్న సమయంలో దానిని నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా నాచురల్ రెమెడీస్ ఫాలో అయితే కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు మాత్రం తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.