మనలో చాలామందిని ఆయాసం సమస్య వేధిస్తుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఈ సమస్యతో బాధ పడుతూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. రెండు చిటికెల పసుపు, చిటికెడు మెత్తటి ఉప్పు తీసుకోవడం ద్వారా ఆయాసం సమస్య దూరమవుతుంది. వేడి టీలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అరచెంచా తేనె కలిపి తాగడం వల్ల ఆయాసం సమస్య దూరమవుతుంది.
ఆయాసం బాగా ఎక్కువగా ఉంటే వామును వేడి చేసి వీపుపైన, గొంతుపైన ఉంచడం ద్వారా సమస్య దూరమయ్యే అవకాశం ఉంటుంది. లేత ముల్లంగి, వెలగపండు, తేనె తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆయాసం సమస్యతో బాధ పడేవాళ్లు కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. చన్నీటి స్నానం, మంచులో తిరగటానికి కూడా దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది.
చేప, సొరకాయ, దుంప కూరలు, మినుములు, బచ్చలికూర, నూనె పదార్థాలు, పుల్లటి పదార్థాలు, ఐస్ క్రీమ్ లకు దూరంగా ఉంటే హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. చక్కెర కలపని నిమ్మరసం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పాలకూర రక్తాన్ని పలుచగా చేయడంలో సహాయపడుతుంది.
పాలకూరను తరచూ తీసుకోవడం ద్వారా శరీరంలో రక్తసరఫరా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. పాలకూర తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయి. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో పాలకూర సహాయపడుతుంది.