రాత్రి సమయంలో నిద్ర రావడం లేదా.. సమస్యకు సులువుగా చెక్ పెట్టే చిట్కాలివే!

ఈతరం యువతలో చాలామంది సరైన నిద్ర లేకపోవడం వల్ల వేర్వేరు ఆరోగ్య సమస్యలతో బాధ పడటంతో పాటు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిద్రలేమికి ఎన్నో కారణాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు కారణాల వల్ల నిద్రలేమి సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రాత్రి సమయంలో టీవీ, మొబైల్స్ కు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల కూడా ఎక్కువమంది నిద్ర సమస్యలతో బాధ పడుతున్నారు.

నిద్రలేమి వల్ల కొత్తకొత్త ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. బీపీ, గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ కు నిద్రలేమి కారణమవుతుందని చెప్పవచ్చు. రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర లేకపోతే మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మూత్రపిండాల వైఫల్యం ,మధుమేహం సమస్యలతో బాధపడే వాళ్లను నిద్ర సంబంధిత సమస్యలు ఎక్కువగా వేధిస్తాయని చెప్పవచ్చు.

లావెండర్ సబ్బును దిండు కింద ఉంచడం ద్వారా నిద్రలేమి దూరమవుతుంది. పాదాల దగ్గర బెడ్ షీట్ కింద లావెండర్ సబ్బును ఉంచడం ద్వారా త్వరగా నిద్ర పడుతుందని చెప్పవచ్చు. రాత్రి నిద్రపోయే సమయంలో వాడే దుస్తులను సైతం మారుస్తూ ఉండాలి. రాత్రి సమయంలో కాళ్లకు కొబ్బరినూనె రాయడం ద్వారా మంచి నిద్ర లభిస్తుందని చెప్పవచ్చు.

ఎన్ని చిట్కాలు పాటించినా నిద్ర పట్టని పక్షంలో వైద్యుల సలహాలను పాటించి ట్యాబ్లెట్లను తీసుకుంటే మంచిది. అయితే ఈ ట్యాబ్లెట్లను నిర్దేశించిన మోతాదులో వాడితే మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి. వైద్యుల సూచనలను పాటిస్తూ నిద్రకు సంబంధించిన ట్యాబ్లెట్లను ఉపయోగించాలి. రాత్రి సమయంలో గోరువెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది.