మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో నోటిపూత సమస్య వేధిస్తుంది. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా నోటిపూత సమస్య వల్ల ఆహారం తీసుకునే సమయంలో ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నాలుక, పెదవులలో చిన్నచిన్న పుండ్లుగా వస్తే ఆ సమస్యను నోటిపూత అని అంటారు. కొన్నిసార్లు ఈ సమస్య సులువుగానే తగ్గితే మరికొన్ని సందర్భాల్లో ఎక్కువ రోజుల పాటు వేధిస్తుంది.
అధిక ఒత్తిడి, మనం తీసుకునే ఆహారం వల్ల ఎక్కువ సందర్భాల్లో ఈ సమస్య వస్తుంది. నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోయినా, హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా ఎక్కువగా పెయిన్ రిలీఫ్ టాబ్లెట్లు తీసుకున్నా కూడా నోటిపూత సమస్య ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమస్యతో బాధ పడేవాళ్లు మొదట శరీర ఉష్ణోగ్రతలను అదుపులో పెట్టుకోవాలి.
తేనె, పసుపును నోటిపూత వచ్చిన చోట పెడితే ఆ సమస్య తగ్గుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా నోటిపూత సమస్యను దూరం చేసుకోవచ్చు. నెయ్యి, ఆకుకూరలు, పండ్లు ఉన్న ఆహారం తీసుకుంటూ మసాలా, కారం, పులుపు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. నోటిపూత వచ్చిన చోట నెయ్యి రాయడం వల్ల కూడా సమస్యకు చెక్ పెట్టవచ్చు. బియ్యం కడిగిన నీళ్లలో పటిక బెల్లాన్ని కలిపి తీసుకుంటే నోటిపూత సమస్యకు చెక్ పెట్టవచ్చు.
కొత్తిమీర కషాయాన్ని పుక్కిలించడం ద్వారా కూడా నోటిపూత సమస్య దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. తులసి ఆకులను తినడం వల్ల కూడా నోటిపూత సమస్యకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తమలపాకులను నమిలి తినడం వల్ల కూడా నోటిపూత సమస్య దూరమవుతుంది. గ్లిజరిన్ వల్ల కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా కూడా నోటిపూత సమస్యలు దూరమవుతాయి.