వంకాయలు తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ సమస్యలు ఉన్నవాళ్ల ప్రాణాలకే ప్రమాదమా?

మనలో చాలామంది ఎంతగానో ఇష్టపడే కూరగాయలలో వంకాయ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. అయితే అలర్జీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వంకాయ తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతారు. అయితే వంకాయలు ఎక్కువగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎక్కువగా వంకాయలు తినేవాళ్లను వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

తలనొప్పి, దురదలు, వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలకు వంకాయ కారణమయ్యే అవకాశం ఉంది. వంకాయ తినడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే వంకాయ తింటారో వాళ్లకు ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొలల సమస్యతో బాధ పడేవాళ్లు కూడా వంకాయ తినకూడదు. కొన్ని ఆరోగ్య సమస్యలకు సంబంధించిన మందులు వాడే సమయంలో కూడా వంకాయకు దూరంగా ఉంటే మంచిది.

ఎముకల సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు కూడా వంకాయలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు వంకాయలకు దూరంగా ఉంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వంకాయ వల్ల లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో నష్టాలు అదే స్థాయిలో ఉన్నాయి. వంకాయలను తరచూ తినేవాళ్ల్ ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది.

వంకాయ అంటే ఇష్టం ఉన్నా మరీ ఎక్కువ మొత్తం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. వంకాయ వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వంకాయలను తరచూ తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.