జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో సమస్యకు చెక్?

Hair-loss-1280x720

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని జుట్టు రాలడం సమస్య వేధిస్తోంది. ఈ సమస్య వినడానికి చిన్న సమస్యలా అనిపించినా అనుభవించిన వాళ్లకు మాత్రమే ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తెలుస్తాయి. అయితే విటమిన్ ఇ క్యాప్సూల్స్ ద్వారా జుట్టు సంబంధిత సమస్యలకు సులువుగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏ సమస్య వల్ల జుట్టు పాడైనా, జుట్టు పెరుగుదల ఆగిపోయినా, ఇతర కారణాల వల్ల జుట్టు రాలుతున్నా ఈ క్యాప్సూల్స్ ఆ సమస్యను దూరం చేస్తాయి. పొల్యూషన్, తీసుకునే ఆహారం, ఇతర కారణాల వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువమందిని జుట్టు రాలే సమస్య వేధిస్తోంది. ఈ క్యాప్సూల్స్ ను కట్ చేసి కలబందతో ఆ మిశ్రమాన్ని కలిపి బాగా మసాజ్ చేస్తే ఈ సమస్య సులువుగా దూరమవుతుంది.

జుట్టు మూలాలపై బాగా మసాజ్ చేయడం ద్వారా జుట్టు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఈ క్యాప్సూల్స్ తో మసాజ్ చేసిన కొంత సమయం తర్వాత తల స్నానం చేస్తే మంచిది. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేయడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. గుడ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్య తగ్గుతోంది.

జుట్టు సంబంధిత సమస్యల వల్ల మానసికంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జుట్టు సమస్యల వల్ల జీవితాంతం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు విషయంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.