ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్.. జుట్టుకు చాలా ప్రమాదమట!

ఈ మధ్య కాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎక్కువ బరువు ఉన్నవాళ్లు బరువు తగ్గడం కోసం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పై ఆధారపడుతున్నారు. అయితే ఈ తరహా ఉపవాసం చేస్తే జుట్టు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలుస్తోంది. రోజులో తినాల్సిన ఆహారాన్ని వేగంగా ఒకే సమయంలో మిగతా సమయంలో తినకుండా ఉండటాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటారు.

ఉపవాసాలు ఉంటున్న వారిని లోతుగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఎవరైతే ఈ విధంగా ఫాస్టింగ్ చేస్తారో వాళ్లు బరువు తగ్గడంతో పాటు షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. దాదాపుగా 12 శాతం మంది ఈ తరహా ఫాస్టింగ్ విషయంలో పాజిటివ్ గా అభిప్రాయాలను పంచుకోవడం గమనార్హం. అయితే ఈ తరహా ఉపవాసం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.

ఎవరైతే ఈ తరహా ఉపవాసాన్ని ఫాలో అవుతారో వాళ్లలో జుట్టు ఎదుగుదలపై మాత్రం ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. కుదుళ్లల్లోని స్టెమ్ సెల్స్ ఉపవాసాల కారణంగా కనుమరుగైపోయినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ పరిశోధన ఫలితాలు ఎలుకలపై చేసినవి కాగా మనుషులపై కూడా పరిశోధనలు చేసి ఫలితాలను వెల్లడించాల్సి ఉంది.

ఈ తరహా ఉపవాసాల వల్ల తమ ఆరోగ్యం మెరుగుపడిందని చాలామంది చెప్పారని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ తరహా ఉపవాసం వల్ల జీవక్రియలు వేగవంతమై మరింత అలర్ట్‌గా ఉన్నామని చెబుతుండటం గమనార్హం. ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.