జుట్టు రాలకుండా ఉండాలంటే అదిరిపోయే చిట్కాలు ఇవే.. ఈ చిట్కాలు పాటిస్తే చాలంటూ?

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని జుట్టు రాలే సమస్య వేధిస్తోంది. రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు ఊడటం, వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు పెరగటం సహజంగా జరుగుతుందనే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు వెంట్రుకలు ఊడిన చోట ఖాళీ ఏర్పడినా, తల పల్చబడుతున్నా వెంట్రుకలు అసహజంగా ఊడిపోతున్నట్టు భావించాల్సి వస్తుంది. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలుంటాయని చెప్పవచ్చు.

బట్టతల, నుదురు దగ్గర వెంట్రుకలు ఊడటం, స్త్రీలలో జుట్టు పలుచబడటంలాంటి సమస్యలకు కొన్నిసార్లు వంశపారంపర్యంగా వచ్చిన సమస్యలు సైతం కారణమవుతాయి. కుదుళ్ల ఇన్‌ఫెక్షన్లు, హార్మోన్లలో అవకతవకల వల్ల కూడా చాలా సందర్భాల్లో జుట్టు రాలే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. గర్భనిరోధక మాత్రలు, కేన్సర్‌, ఆర్థ్రయిటిస్‌, అధిక రక్తపోటు కూడా వెంట్రుకలు రాలటానికి కొన్నిసార్లు కారణమవుతుంది.

వారానికి ఒకసారి టేబుల్‌స్పూన్‌ ఉసిరి పొడికి, 1 టేబుల్‌స్పూన్‌ నిమ్మరసం కలిపి కుదుళ్లకు పట్టించి రాత్రంతా వదిలేసి పొద్దునే తలస్నానం చేయడం ద్వారా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కుదుళ్లకు కలబంద గుజ్జును పట్టించడం ద్వారా కూడా జుట్టు రాలే సమస్య దూరమవుతుంది. మెంతులు రాత్రంతా నీళ్లలో నానబెట్టి పొద్దునే మెత్తగా రుబ్బి వెంట్రుకలకు పట్టించి 40 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

ఈ చిట్కాలు పాటించినా జుట్టు సంబంధిత సమస్యలు దూరం కాకపోతే మాత్రం వైద్యులను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు. జుట్టు సంబంధిత సమస్యలకు మందులు సైతం పని చేసే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి.