మనలో చాలామందిని వేధించే సమస్యలలో థైరాయిడ్ సమస్య ఒకటి కాగా ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య బారిన పడితే ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఊబకాయం సమస్యతో బాధ పడేవారని వేధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల థైరాయిడ్ కంట్రోల్ లో ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మన దేశంలోని 4 కోట్ల మందిని థైరాయిడ్ సమస్య వేధిస్తోందని తెలుస్తొంది. జీవనశైలి మార్పులు, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువమందిని థైరాయిడ్ సమస్య వేధిస్తోందని బోగట్టా. థైరాయిడ్ గ్రంథికి ఏదైనా సమస్య వస్తే శరీరంలో హార్మోన్ల సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థైరాయిడ్ వల్ల బరువు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది.
జుట్టు రాలడం, అలసట, నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చకపోవడం సమస్యలకు థైరాయిడ్ కారణమయ్యే అవకాశం ఉంటుంది. శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేసేలా చేయడంలో థైరాయిడ్ గ్రంథి తోడ్పడుతుంది. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో ఉసిరి సహాయపడుతుంది. ఉసిరి పచ్చడిని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.
క్యారెట్, బీట్ రూట్, కీర, టమాటా కలిపి చేసిన జ్యూస్ పరగడుపున తాగితే మంచిది. ఈ జ్యూస్ తాగడం వల్ల థైరాయిడ్ సమస్య దూరమయ్యే అవకాశం ఉంటుంది. థైరాయుడ్ సమస్యతో బాధ పడేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది.