నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. హెల్త్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్ అర్హతతో పాటు హెల్త్ అండ్ శానిటేషన్ లో డిప్లొమా కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
కనీసం 3 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కనీసం 30 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 38000 రూపాయల వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 2023 సంవత్సరం ఆగష్టు 23వ తేదీ చివరి తేదీగా ఉంది. సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుండగా వెబ్ సైట్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీల వల్ల నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ తక్కువగానే ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎక్కువ వేతనం ఉండటంతో అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.