సజ్జ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

చిరుధాన్యాల్లో ఒకటైన సజ్జలను మన రోజువారి ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్, జింకు, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజలవనాలు మన నిత్య జీవక్రియలకు అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. సజ్జ చిరుధాన్యంతో అనేక రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు వీటిని మన రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సజ్జలను మన పూర్వీకులు రోజువారి ఆహారంలో ఎక్కువగా ఉపయోగించడం వల్ల వారికి కీళ్ల నొప్పులు, షుగర్ ,బీపీ వంటి సమస్యలే తెలియవు కారణం సజ్జల్లో అత్యధికంగా కాల్షియం ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. కాల్షియం అత్యధికంగా లభించడం వల్ల మన ఎముకల దృఢత్వానికి తోడ్పడి వృద్ధాప్యంలో వచ్చే ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి వ్యాధులను కుండా ఆపుతుంది. సజ్జల్లో పుష్కలంగా ఉన్న పీచు పదార్థం రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి పొట్టలోని మలినాలను బయటికి పంపడంలో సహాయం పడుతుంది.

ఊబకాయం అతిబరు సమస్యతో బాధపడేవారు రోజువారి ఆహారంలో సజ్జలను ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న ట్రిప్టోఫాన్ అమినో యాసిడ్ మనలో ఆకలిని తగ్గిస్తుంది తద్వారా సులువుగా శరీర బరువును తగ్గించుకోవడంతో పాటు శరీరంలోను మరియు రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను తొలగించి గుండె ఆరోగ్యాన్ని, మెదడు కణాలను రక్షిస్తుంది. సజ్జల్లో ఉన్న ఐరన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడి అలసట నీరసం వంటి సమస్యలను తొలగిస్తుంది. సజ్జ లాంటి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి రక్త పోటు గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు మన దరి చేరవు. సజ్జలో పుష్కలంగా ఉన్న విటమిన్స్ మెగ్నీషియం జింకు వంటివి మెదడు ఆరోగ్యాన్ని రక్షించి జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి.