మనలో చాలామంది ఎండుద్రాక్షలను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. ఎండు ద్రాక్షను పాలలో కలిపి తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. శుక్ర కణాలు చురుగ్గా ఉండేలా వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో ఎండు ద్రాక్ష ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగు పరిచే విషయంలో ఎండు ద్రాక్షలు తోడ్పడతాయి.
ఎండు ద్రాక్షలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఎండుద్రాక్షలో ఉన్న విటమిన్ బి కాంప్లెక్స్ రక్తహీనత సమస్యకు సులభంగా చెక్ పెడుతుంది. మలబద్ధకం, అసిడిటీ, అలసట సమస్యలతో బాధ పడేవాళ్లు నానబెట్టిన ఎండుద్రాక్షలను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఎండుద్రాక్షలో ఉండే రాగి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
నానబెట్టిన ఎండుద్రాక్షలో పోషకాలు అధికంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. నానబెట్టిన ఎండుద్రాక్ష తీసుకోవడం ద్వారా ఐరెన్, బి-కాంప్లెక్స్ విటమిన్లు లభించే అవకాశం ఉంటుంది. ఎండుద్రాక్షను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సులభంగా లభించే అవకాశాలు అయితే ఉంటాయి. ద్రాక్ష పండ్లను ఎండబెట్టి ఎండు ద్రాక్షను తయారు చేయడం జరుగుతుంది.
ఎండు ద్రాక్షలో పోషకాహార విలువలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తింటే అండాశయంలోని సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. యూరినల్‌లో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా చేయడంలో ఇవి సహాయపడతాయని చెప్పవచ్చు.