నానబెట్టిన ధనియాల నీళ్లు తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. ఆ సమస్యలకు చెక్ అంటూ?

మనలో చాలామందిని నిత్యం ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అయితే ధనియాల నీళ్లు తాగడం ద్వారా ఆ ఆరోగ్య సమస్యలలో మెజారిటీ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ధనియాల నీళ్లలో రాళ్ల పంచదార కలిపి తాగడం వల్ల శరీరంలోని చికాకులు సులువుగా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అసిడిటీ సమస్యలు, కడుపులో మంట ఇతర సమస్యలకు ధనియాల నీళ్లు చెక్ పెడతాయి.

ఎండ వేడి వల్ల ఇబ్బందులు పడుతుంటే ఆ సమయంలో ధనియాల నీళ్లు తాగడం ఉత్తమమని చెప్పవచ్చు. చేతులు, కాళ్ల మంట సమస్యలకు సైతం ధనియాల నీళ్లు చెక్ పెడతాయి. డీ హైడ్రేషన్ సమస్య వేధిస్తుంటే ధనియాల నీళ్లు తీసుకోవడం ద్వారా ఆ సమస్య కూడా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ధనియాల గింజలను నలిపి నీళ్లలో రాత్రంతా నానబెట్టి తాగడం వల్ల ఈ హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

వాత, పిత్త మరియు కఫ దోషాలకు చెక్ పెట్టడంలో ధనియాల నీళ్లు ఉపయోగపడతాయి. జీర్ణ లక్షణాలను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేయడంలో ధనియాల నీళ్లు సహాయపడతాయి. రోజుకు రెండు నుంచి మూడుసార్లు పరిమిత మొత్తంలో ధనియాల నీళ్లు తీసుకోవచ్చు. కడుపులో నులిపురుగుల సమస్యలు, గర్భధారణ సంబంధిత రుగ్మతలు, జ్వరం సమస్యలకు సైతం ధనియాల నీళ్లు సులభంగా చెక్ పెడతాయి.

ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం వైద్యుల సలహాలు తీసుకుని ధనియాల నీళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. ధనియాల నీళ్లు తాగిన తర్వాత విరేచనాలు, జలుబు-దగ్గు, కడుపునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు కనిపిస్తే మాత్రం వైద్యులను సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు.