మన భారతదేశంలో వివిధ రకాల మసాలా దినుసులు వంటలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మసాలా దినుసుల వల్ల ఆహారం రుచికరంగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన వంటింట్లో ఉండే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దాల్చిన చెక్కను వినియోగిస్తారు. ముఖ్యంగా మాంసాహారం తయారు చేయడంలో ఈ దాల్చిన చెక్కను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ దాల్చిన చెక్కను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో దీనిని సుగంధ ద్రవ్యంగా పరిగణిస్తారు. ప్రాచీన కాలం నుండి వినియోగించి ఈ దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దాల్చిన చెక్కలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల తరచూ మనం తినే ఆహారంలో దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి సమస్యలను కూడా నివారించవచ్చు. అంతేకాకుండా ఈ దాల్చిన చెక్కలో ఉండే కొన్ని పోషక పదార్థాలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరం ఇన్ఫెక్షన్ భారిన పడకుండా కాపాడుతాయి. దాల్చిన చెక్కను ఆహారంతో కలిపి తీసుకోవడం వల్ల ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ముఖ్యంగా జలుబు దగ్గు తలనొప్పి గొంతు నొప్పి వంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉండటానికి దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిలో కొంచెం దాల్చిన చెక్క వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని కొంచెం చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగటం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యలు దూరం అవుతాయి. అంతే కాకుండా ఈ నీటిని ప్రతిరోజు రాత్రి తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ దాల్చిన చెక్క ఎంతో ఉపయోగపడుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి ఉదయం సాయంత్రం ప్రతిరోజు తాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించి శరీర బరువును తగ్గిస్తుంది. మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.