సుగంధద్రవ్యాల్లో ఒకటైన దాల్చిన చెక్క మనందరి వంట గదిలో ఎల్లప్పుడూ మనందరికీ అందుబాటులోనే ఉంటుంది. కావున ఈ సుగంధ ద్రవ్యాన్ని ఉపయోగించి కొన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, చర్మ సమస్యలు, పురుషుల్లో అంగస్తంభన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం చూపుతుంది. అలాగని మరీ ఎక్కువ దాల్చిన చెక్కను ఆహారంలో తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అందుకే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటించే ముందు వైద్య సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు.
ప్రతిరోజు దాల్చిన చెక్క పొడిని పాలలో కలుపుకొని సేవిస్తే ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ గుణాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతాయి. అలాగే మనలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.
పురుషుల దాంపత్య జీవనానికి అడ్డంకిగా మారే శారీరక బలహీనత,వ్యంధత్వ లక్షణాలు, అంగస్తంభన సమస్యలకు దాల్చిన చెక్క చక్కటి పరిష్కారం చూపుతుంది. ఇందుకోసం దాల్చిన చెక్క పొడిని పాలు లేదా నీళ్లలో కలుపుకొని సేవించవచ్చు. మరియు సలాడ్స్, సూప్స్ రూపంలో నైనా దాల్చిన చెక్కను తీసుకుంటే శారీరక బలహీనతలు తొలగిపోయి శక్తివంతం అవుతుంది.
చర్మ సమస్యలతో బాధపడేవారు దాల్చిన చెక్క పొడిని తేనెలో కలిపి మొటిమల మచ్చలపై రాస్తే ఇందులో ఉండే యాంటీ మైక్రోబియన్ గుణాలు ప్రమాదకర బ్యాక్టీరియాను నశింపజేసి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు మీలో వృద్ధాప్య లక్షణాలను కూడా తగ్గిస్తుంది. దాల్చిన చెక్కను మెత్తటి మిశ్రమంగా చేసుకునిజుట్టుకు రాసుకుని తలస్నానం చేస్తే జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోయి ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.