మనలో చాలామంది వేర్వేరు వంటకాల్లో దాల్చిన చెక్కను వినియోగిస్తారు. దాల్చిన చెక్కను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. దాల్చిన చెక్క సహజ ఔషధ నివారిణిగా ఎంతగానో ఉపయోగపడుతుంది. స్పైసీ కర్రీలు, కూరలలో దాల్చిన చెక్కను ఎక్కువగా ఉపయోగిస్తారు. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది.
దాల్చిన చెక్క వాడటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని చెప్పవచ్చు. దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. మధుమేహం ఉన్నవాళ్లు ప్రతిరోజూ దాల్చిన చెక్క నీటిని తీసుకుంటే ఎంతో మంచిది. దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం వల్ల కడుపుమంట సమస్య తగ్గే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. దాల్చిన చెక్క నీటి వల్ల శరీరంలోని వాపును తగ్గించుకోవచ్చు.
దాల్చిన చెక్కలో శరీరానికి అవసరమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం గమనార్హం. గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ సమస్యలకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కను వాడటం వల్ల అల్జీమర్స్ వ్యాధి దూరమవుతుంది. న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ ను తగ్గించడంలో దాల్చిన చెక్క ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు.
అంటు వ్యాధులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుందని చెప్పవచ్చు. దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాల్చిన చెక్క వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి.