ఉదయాన్నే అల్పాహారంలో పండ్లను తింటున్నారా…. తప్పక ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే!

2-2-2-3foodgroups_fruits_detailfeature (1)

సాధారణంగా మనందరికీ ఉదయాన్నే అల్పాహారంగా కొన్ని రకాల పండ్లను తీసుకోవడం అలవాటే. అలాగే ఏడాది పొడవున సీజనల్గా లభించే అన్ని రకాల పండ్లను ప్రతిరోజు ఆహారంగా తీసుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే ఆయుర్వేద వైద్య నిపుణుల ప్రకారం ఉదయాన్నే అల్పాహారంగా పండ్లను అస్సలు తినకూడదని చెబుతున్నారు. ఇలా చెప్పడానికి గల కారణాలు? ఉదయాన్నే పండ్లను తింటే కలిగే అనారోగ్య సమస్యలు వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుర్వేదం ప్రకారం ఖాళీ కడుపుతో పండ్లను అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఉదయం 6 నుంచి 10 గంటల సమయంలో ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే ఉదయం పూట వాతావరణం చల్లగా ఉంటుంది.దానికి తోడు జీర్ణాశయం లో కూడా వేడి తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పండ్లను తింటే అది మరింత చల్లగా మారుతుంది. తద్వారా జీర్ణాశయంలో సమస్యలు తలెత్తి యాసిడ్ రిఫ్లెక్షన్ వల్ల కపం, జలుబు, కడుపులో మంట అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.నిజానికి ఉదయం పండ్లను తినే అలవాటున్న వారితో పోల్చితే,తినని వారికే బలమైన జీర్ణ వ్యవస్థ ఉండి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని కొన్ని అధ్యయనాల్లో తేలింది

ఉదయం పండ్లను తినకుండా ఉండలేను అనుకుంటే దాల్చినచెక్క లేదా శొంఠి వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలను జల్లుకుని తినొచ్చు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు తగినంత వేడి లభించి తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. అయితే వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పండ్లను తక్కువ మోతాదులో తినొచ్చని చెబుతున్నారు.ఉదయం అల్పాహారంలో సులువుగా జీర్ణం అయ్యే గోరువెచ్చని ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మరియు గోరువెచ్చని పాలల్లో చిటికెడు సొంటి పొడి వేసుకొని సేవిస్తే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.