కాఫీ ఎక్కువగా తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. అలా తాగితే మాత్రం ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది కాఫీని ఎంతో ఇష్టంగా తాగుతారు. కాఫీ తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రోజుకు రెండు లేదా మూడు కప్పులు కాఫీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతిరోజూ కాఫీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు నడుము చుట్టూ కొవ్వు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. కాఫీ మెదడులోని రసాయనిక మార్పులకు కారణమవుతుందని చెప్పవచ్చు.

పనిఒత్తిడి, అలసట సమస్యలతో బాధపడే వాళ్లు కాఫీ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కాఫీ తాగడం వల్ల మెదడులో ఉండే న్యూరో ట్రాన్స్ మీటర్ అడినోసిస్ ను బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి. శరీరంలో నిద్రమత్తును తొలగించే విషయంలో కాఫీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అయితే పరగడుపున కాఫీ తాగడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు.

టీతో పోల్చి చూస్తే కాఫీ తాగడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. రాత్రి సమయంలో కాఫీ తాగడం వల్ల మెమొరీ పవర్ పెరిగే పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్సర్ లాంటి సమస్యలను కాఫీ దూరం చేస్తుందని చెప్పవచ్చు. కాఫీలో కొవ్వును కరిగించే గుణాలు ఉండటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు ఉంటాయి.

అయితే కాఫీలో ఎసిడిక్ గుణం ఎక్కువగా ఉంటుంది. మోతాదులో కాఫీని తీసుకుంటే మాత్రమే ఈ హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు ఉంటాయి. మోతాదు మించితే మాత్రం కాఫీ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుందని చెప్పవచ్చు. కాఫీలో ఉండే కెఫీన్ మోతాదు మించితే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఫిల్టర్ చేయని కాఫీ తాగితే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది.