Red Lady Fingers: ఎర్ర బెండకాయలు ఎప్పుడైనా తిన్నారా… ఇవి కనిపిస్తే అస్సలు వదిలి పెట్టకండి!

Red Lady Fingers: మనం మార్కెట్లో తరచూ ఆకుపచ్చని బెండకాయలను చూసి ఉంటాము కానీ ఎర్ర బెండకాయలు చాలా అరుదుగా కనపడుతూ ఉంటాయి. అయితే ఈ ఎర్ర బెండకాయలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పండిస్తూ ఉంటారు. మార్కెట్లో కనుక మీకు ఎర్ర బెండకాయలు కనిపించాయి అంటే అసలు వదిలిపెట్టకుండా వాటిని తెచ్చుకొని వివిధ రకాలుగా కూర తయారు చేసుకుని తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెండకాయలు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఎర్ర బెండకాయలో మరింత అదనంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఎర్ర బెండకాయలో ఉన్నటువంటి పోషక విలువలు మనకు ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా చర్మ జుట్టు సౌందర్యాన్ని కూడా పెంపొందింప చేస్తాయి. ఎర్రటి బెండకాయల వల్ల ఒత్తిడి, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు దూరమౌపోతాయి. ప్రతిరోజు రెండు ఎర్ర బెండకాయలను మధ్యలోకి నిలువునా కట్ చేసి ఒక గ్లాసు నీటిలో వేసుకోవాలి ఉదయమే ఈ నీటిని తాగటం వల్ల డయాబెటిక్ పేషెంట్లకు షుగర్ లెవెల్స్ నిలకడగా ఉండడమే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి.

ఇక ఈ నీటి వల్ల చర్మ సౌందర్యం కూడా పెంపొందుతుందని నిపుణులు చెబుతున్నారు చర్మంపై ఏర్పడిన మచ్చలు మొటిమలు వంటివి కూడా తొలగిపోతాయి.మహిళలు ముఖ్యంగా చాలా మంది పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ప్రతిరోజు బెండకాయల్ని తింటు ఉండాలి. ఇక మహిళలు పీరియడ్స్ వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక చాలా మంది వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా ఇదొక మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఈ బెండకాయలను తరచు తినటం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ ఎంతో మెరుగుపడి ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.