ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని మధుమేహం సమస్య వేధిస్తోంది. ఈ సమస్య తీవ్రమైతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. మధుమేహంను పూర్తిస్థాయిలో కంట్రోల్ చేయలేకపోయినా కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఫైబర్, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చియా సీడ్స్ లో ఎక్కువగా ఉంటాయి. చియా సీడ్స్ తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.
రోజూ చియా సీడ్స్ తీసుకోవడం ద్వారా లాభాలే తప్ప నష్టాలు ఉండవని చెప్పవచ్చు. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బరువు తగ్గాలని భావించేవాళ్లు, గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడానికి చియా సీడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. చియా సీడ్స్ తీసుకోవడం ద్వారా ఎముకలను బలంగా నిర్మించుకోవడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
చియా సీడ్స్ లో ప్రోటీన్, ఫైబర్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే కడుపు నిండే అవకాశం అయితే ఉంటుంది. బొడ్డు కొవ్వును తగ్గించుకోవడంతో చియా సీడ్స్ తోడ్పడతాయని చెప్పవచ్చు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చియా సీడ్స్ ఉపయోగపడతాయి. చియా సీడ్స్ లో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం లాంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. చియా గింజలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి.
సూర్యరశ్మిలో దెబ్బతినకుండా చర్మం అవరోధాన్ని బలోపేతం చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. చియా గింజలలో ఫైబర్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉండటం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఈ విత్తనాలు మెరుగుపరుస్తాయి.