ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమందిని జుట్టు రాలే సమస్య వేధిస్తుండగా జుట్టు రాలడం వల్ల చాలామంది టెన్షన్ పడతారనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పోషకాహారలోపం, హార్మోన్ల అసమతౌల్యత, థైరాయిడ్, పిసివొఎస్ ఇతర కారణాల వల్ల జుట్టు రాలే ఛాన్స్ అయితే ఉంటుంది.
మందులు, హెయిర్ డైల వల్ల కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలు కొన్ని సందర్భాల్లో వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. లావు తగ్గడం, జడను బిగదీసి వేసుకోవడం, వయసు పెరగడం, విటమిన్ సి లోపం కూడా జుట్టు సమస్యలకు కారణమవుతుంది. హెర్బల్ డికాషన్ తీసుకోవడం ద్వారా జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
రెండు నిమ్మకాయల రసాన్ని రెండు కప్పుల నీళ్లల్లో వేసి జుట్టుకు అప్లై చేయడం ద్వారా కూడా జుట్టు సమస్యలు దూరమవుతాయి. రెండు చెంచాల టీపొడి, తులసీ ఆకులను మరిగించి అందులో షాంపూ కలిపి తలకు అప్లై చేసి తలస్నానం చేయడం ద్వారా జుట్టు అందంగా కనిపిస్తుంది. మెంతులను పుల్లటి పెరుగులో నానబెట్టి తలస్నానం చేయడం ద్వారా కూడా జుట్టు సమస్యలు దూరమవుతాయి.
తలకు వేపనూనె రాయడం ద్వారా కూడా జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అరటిపండు గుజ్జును తలకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేయడం ద్వారా కూడా జుట్టు సమస్యలు దూరమవుతాయి. కలబంద గుజ్జు, ఉల్లి రసం జుట్టుకు అప్లై చేయడం ద్వారా కూడా జుట్టు సంబంధిత సమస్యలు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.