ఓట్స్ తినడం వల్ల ఏకంగా ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చా?

మనలో చాలామంది ఓట్స్ తినడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. ఓట్స్ తినడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. ఒకప్పుడు ఓట్స్ అంటే పెద్దగా పరిచయం లేకపోయినా ఇప్పుడు మాత్రం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఓట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఓట్స్ తినడం వల్ల బరువు తగ్గుతుందని చాలామంది భావిస్తున్నారు.

ఓట్స్ తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని చెప్పవచ్చు. ఓట్స్ అనేది గ్లూటెన్ రహిత ధాన్యం కాగా ఇవి తీసుకోవడం వల్ల అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇనిస్టెంట్ ఓట్స్ ప్రాసెస్ చేయబడిన ఆహారం కాగా సాదా ఓట్స్ నీళ్లలో లేదా పాలలో వేసి మరిగించి తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ఓట్స్ ద్వారా ఫైబర్, ప్రోటీన్ , ఆరోగ్యకరమైన కొవ్వులు లభించే అవకాశం ఉంది. ఓట్స్ తీసుకోవడం వల్ల మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్, సెలీనియం మరియు అనేక బి విటమిన్లు ఉంటాయి. బరువు తగ్గించే ఆహారంలో ఓట్స్‌ని తీసుకుంటే మంచిది. రోజుకు 250 గ్రాముల ఓట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓట్స్ తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

ఓట్స్ అనేవి కడుపు నిండేలా చేయడంలో ఎంతగానో సహాయపడతాయని చెప్పవచ్చు. మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టడంతో పాటు ప్రేగు కదలికలో ఓట్స్ సహాయపడతాయి. అజీర్ణం , గ్యాస్ వంటి జీర్ణ సమస్యలకు చెక్ పెట్టడంలో ఓట్స్ తోడ్పడతాయి. కార్బోహైడ్రేట్లకు అలెర్జీ ఉంటే మాత్రం . ఓట్స్‌ను పెరుగు లేదా స్మూతీతో కలిపి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.