పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. www.powergrid.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 10వ తేదీ చివరి తేదీగా ఉండనుంది. మొత్తం 184 ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.
ఇంజనీరింగ్ ట్రైనీ(ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 144 ఉండగా ఇంజనీరింగ్ ట్రైనీ(సివిల్) ఉద్యోగ ఖాళీలు 28 ఉన్నాయి. ఇంజనీరింగ్ ట్రైనీ(ఎలక్ట్రానిక్స్) ఉద్యోగ ఖాళీలు 6 ఉండగా ఇంజనీరింగ్ ట్రైనీ(కంప్యూటర్ సైన్స్) ఉద్యోగ ఖాళీలు సైతం మరో 6 ఉన్నాయి. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. 1995 నవంబర్ 10 న లేదా ఆ తరువాత జన్మించిన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్(ఇంజనీరింగ్)లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం 60 శాతం స్కోర్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2023 స్కోర్, బిహేవియరల్ అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ మార్కుల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగానే వేతనం లభించనుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మెడికల్ ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా 500 రూపాయలు చెల్లించాల్సి ఉండగా మిగతా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.