బీఈ, బీటెక్, బీఎస్సీ పాసైన నిరుద్యోగ అభ్యర్థులకు టాటా స్టీల్ అదిరిపోయే తీపికబురు అందించింది. టాటా స్టీల్ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్ – 2023 ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ రిలీజైంది. టాటా స్టీల్ సంస్థకు ప్రజల్లో ప్రజల్లో మంచి పేరు ఉందనే సంగతి తెలిసిందే. ఈ సంస్థలో తయారైన స్టీల్ ఎంతో క్వాలిటీతో ఉంటుందని అందరూ భావిస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అసిస్టెంట్ మేనేజర్ హోదాను కల్పించడం జరుగుతుంది. 2023 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. శిక్షణ పూర్తైన తర్వాత 6 లక్షలకు పైగా ఏడాదికి వేతనం పొందే అవకాశం ఉంటుంది.
ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాగ్నిటివ్, టెక్నికల్ పరీక్షలలో మంచి మార్కులు సాధించిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ జాబ్స్ కు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొందని వినిపిస్తుండటం గమనార్హం.
బీటెక్ అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మెకానికల్, మెటలర్జీ ఉత్తీర్ణులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ విద్యార్థులు వెంటనే ఈ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగులకు మరింత మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి.