రైతులకు అదిరిపోయే తీపికబురు.. ఆ స్కీమ్ ద్వారా ఏకంగా రూ.3 లక్షల బెనిఫిట్ పొందే ఛాన్స్!

ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రయోజనం చేకూరే దిశగా అడుగులు వేస్తూ రైతుల కోసం ఎన్నో కీలక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు సర్కార్ గతంలో అమలు చేసిన కొన్ని పథకాలను మళ్లీ అమలు చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలిగేలా కూటమి సర్కార్ నిర్ణయాలు ఉన్నాయి.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2,400 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ ను అమలు చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ స్కీమ్ అమలు కోసం 11 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర వాటాను ఈ స్కీమ్ కోసం కేటాయించి ఈ స్కీమ్ అమలు దిశగా అడుగులు వేయనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.

డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా పంటలు పండిస్తే కలుపు సమస్య కూడా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధానం ద్వారా మరీ ఎక్కువగా కష్టపడకుండానే పంటలు పండించే అవకాశం అయితే ఉంటుంది. అన్ని పంటల కోసం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏకంగా 3 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రైతులకు మేలు చేసేలా ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.