ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్తున్నారా.. సమస్యకు చెక్ పెట్టే అద్భుత చిట్కాలివే!

కొన్ని సమస్యలు చిన్న సమస్యలుగా అనిపించినా ఆ సమస్యల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొన్ని సమస్యలకు సరైన మందులు లేకపోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. మూత్రాశయం నిండిన సమయంలో నాడుల ద్వారా మెదడుకు అందుకు సంబంధించిన సమాచారం అందుతుంది. ఆ సమయంలో మూత్ర విసర్జనకు వెళ్లడం జరుగుతుంది.

అయితే రోజులో 7 నుంచి 8 కంటే ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేస్తున్నారంటే మాత్రం వేర్వేరు ఆరోగ్య సమస్యలు కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. రాత్రి సమయంలో మూత్ర విసర్జనకు పదేపదే వెళ్లాల్సి వస్తున్నా మూత్ర విసర్జన సమస్య వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. సమస్య మరీ ఎక్కువగా ఉంటే మాత్రం టెన్షన్ ఫ్రీ వజైనల్ టిప్ సర్జరీని చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు.

బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కొన్నిసార్లు ఈ సమస్య వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. క్షయ, మధుమేహం నియంత్రణలో లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ఈ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. యాంటీ కొలనర్జిక్ మందులు వాడటం ద్వారా మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ మందులు వాడితే నోరు ఎండిపోవడం, మలబద్ధకం లాంటి సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ప్రొస్టేట్ సమస్యలు ఉన్నవాళ్లను సైతం అతిమూత్రం సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. రాత్రి పడుకునేముందు పాలు, మజ్జిగకు దూరంగా ఉండాలి. బరువును కంట్రోల్ లో ఉంచుకుంటూ దూమపానానికి దూరంగా ఉంటూ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఉసిరి తినడం, జీలకర్ర మరిగించిన నీటిని తాగడం, తులసి ఆకులను మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందే ఛాన్స్ ఉంటుంది.