తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ వల్ల పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. మహాలక్ష్మి స్కీమ్ ను తెలంగాణ సర్కార్ అమలు చేస్తుండగా ఈ స్కీమ్ వల్ల ఆడపిల్లలకు ఎంతో లాభం కలుగుతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం యువతులకు ఉచితం స్కూటీ ఇస్తామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో నివశిస్తూ 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి చెంది చదువుకుంటున్న యువతులు ఈ స్కీమ్ కు అర్హులు. ఇంటర్ పాసై పేద కుటుంబాలకు చెందిన వాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఏజ్ సర్టిఫికెట్, పాస్ పోస్ట్ సైజ్ ఫోటో, అప్లికేషన్ ఫీజు, ఈమెయిల్ ఐడీ, క్యాస్ట్ సర్టిఫికెట్, మొబైల్ నంబర్, రెసిడెన్స్ ప్రూఫ్, ఇన్ కమ్ సర్టిఫికెట్ లను అందజేయడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://telangana.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు ఫారమ్ అందుబాటులో ఉంచనున్నారు. ఆన్ లైన్ ద్వారా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుని సర్టిఫికెట్లను తీసుకుని సులువుగా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి అవగాహన తెచ్చుకుని దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని లక్షల సంఖ్యలో యువతులు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందనున్నారని తెలుస్తోంది.