హెల్త్ కాపాడుకుంటూనే బెస్ట్ ఫుడ్ తినండి .. కడుపునిండా !

మనం ఆరోగ్యంగా ఉండాలంటే హాస్పిటల్స్ చుట్టో, జిమ్స్ చుట్టో తిరగాల్సిన అవసరం లేదు. మనం రోజు తీసుకునే ఫుడ్ పట్ల కొంచెం జాగ్రత్త వహిస్తే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. మనం రోజు తీసుకునే ఆహారంలో ఉండే ఎన్నో పోషకాలు మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. మనం రోజు ఆహారంలో వాడుకునే పాలు, ఆకు కూరలు, పసుపు, జీలకర్ర, మెంతులు, క్యారెట్స్, నెయ్యి, మిరియాలు, పచ్చిమిర్చి లాంటి వాటిలో ఉండే పోషకాలు మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. మనం రోజు క్రమంగా తీసుకునే నీళ్లు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి.
అయితే ఇప్పుడు మనం రోజు తీసుకునే ఆహారంలో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం

* ప్రతి రోజు భోజనం తరువాత చాలామందికి తాంబులం వేసుకునే అలవటాయి ఉంటుంది. అయితే తాంబులంలో ఉండే పోషకాల గురించి మనలో చాలా మందికి తెలియదు. తాంబులంలో ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఎ విటమిన్,సి.విటమిన్ ల ను తమలపాకు ఎక్కువగా కలిగి ఉంది . తాంబూలం రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది.

*మన శరీరంలో గ్లూకోజ్, రక్తం యెక్క స్థాయిలను బ్యాలన్స్ చేయాలంటే మనం ప్రతిరోజు వేరుశనగ పప్పును బెల్లంతో కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల వేరుశనగ పప్పులో ఉన్న పొటాషియం, క్యాల్షియం, విటమిన్ బి, ఫాస్పరస్ పోషకాలు మన దేహంలో గ్లూకోజ్, రక్తం యొక్క స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. అలాగే బెల్లంతో ఉండే జింక్, సెలీనియం వంటి మినరల్స్ కూడా మన రోగ నిరోధక శక్తికని పెంచుతుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు దీన్ని తినవచ్చు.

*మనం రోజు తీసుకునే ఆహారంలో వాడే వెల్లుల్లి కూడా మన ఆరోగ్యానికి దోహదపడుతుంది. వెల్లుల్లి ఉండే విటమిన్ ఏ,జింక్, సల్ఫర్, సెలీనియమ్ లాంటి పోషకాలు యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక కారులుగా పని చేస్తాయి. అలాగే నిమ్మపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే జమ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇలా మనం రోజు తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలు మనకు తెలియకుండానే చాలా హెల్ప్ చేస్తున్నాయి. అలాగే ప్రతి కొంత సమయం వ్యయాయం చేస్తూ ఉండాలి.అలాగే ప్రతిరోజు 7 గంటలు నిద్రపోతే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.