మగవాళ్లు స్పెర్మ్ కౌంట్ పెంచుకోవాలని భావిస్తున్నారా.. తినాల్సిన ఆహారాలివే!

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సంతాన లేమి సమస్య వల్ల బాధ పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల స్పెర్మ్ కౌంట్ సమస్యతో బాధ పడేవాళ్ల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్ ను సులువుగా పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. బీన్స్, రెడ్ మీట్, బార్లీ డైట్ లో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

 

ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. క్యారెట్ స్పెర్మ్ ఉత్పత్తి మొత్తన్ని పెంచడంతో పాటు కంటి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని చెప్పవచ్చు. శరీరంలో హిమో గ్లోబిన్ లెవెల్స్ ను పెంచడంలో దానిమ్మ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. పురుషుల లైంగిక ఆరోగ్యానికి మేలు చేసే విషయంలో దానిమ్మ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

 

ప్రతిరోజూ అరటి పండ్లను తీసుకోవడం వల్ల కూడా అన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అరటి పండ్లలో ఉండే ఎంజైమ్స్ స్పెర్మ్ ఉత్పాదకతను పెంచుతాయి. ఈ పండ్లలో ఉండే బ్రోమెలైన్ అనే అరుదైన ఎంజైమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. గుడ్లు తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. స్పెర్మ్ సమస్యలకు చెక్ పెట్టడంలో గుడ్లు ఎంతగానో తోడ్పడతాయని చెప్పవచ్చు.

 

పాలకూర తరచూ తీసుకుంటే అందులో ఉండే ఫోలిక్ యాసిడ్ స్పెర్మ్ ఉత్పత్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ సైతం జననాంగాలలో రక్త ప్రసరణ రేటును పెంచుతుందని చెప్పవచ్చు. టొమాటోలను ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా కూడా స్పెర్మ్ ఉత్పత్తి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.