ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే డయాబెటిస్ వచ్చే అవకాశం.. జాగ్రత్త పడాల్సిందే!

176175-diabetes

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కువమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి ఒకసారి డయాబెటిస్ బారిన పడితే వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంటుంది. మధుమేహం వల్ల శరీరంలోని వేర్వేరు అవయవాలపై తీవ్రస్థాయిలో ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కిడ్నీ, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని డయాబెటిస్ పెంచే ఛాన్స్ ఉంటుంది.

 

డయాబెటిస్ లక్షణాలను ముందే గుర్తించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, జంక్ ఫుడ్ పై ఆసక్తి చూపిస్తుండటం వల్లే ఎక్కువమంది డయాబెటిస్ బారిన పడుతున్నారని సర్వేల ద్వారా తెలుస్తోంది. చిన్న పని చేసినా విపరీతంగా అలసట ఉందంటే దానిని డయాబెటిస్ కు సంకేతంగా గుర్తించాలి.

 

తరచూ మూత్ర విసర్జన, నీళ్లు తాగినా మళ్లీ వెంటనే దాహం వేయడం లాంటి సమస్యలు కూడా డయాబెటిస్ కు కారణం అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే డయాబెటిస్ తో బాధ పడుతుంటారో వాళ్లలో ఆకలి తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తరచూ కళ్లు తిరగడం, కంటి సంబంధిత సమస్యలు వేధించడం కూడా డయాబెటిస్ కు సంకేతం అని చెప్పవచ్చు.

 

ఈ సమస్యలు మీలో ఉంటే జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహంకు చెక్ పెట్టవచ్చు. స్టార్టింగ్ స్టేజ్ లో డయాబెటిస్ ను గుర్తిస్తే మంచిది. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్ సమస్య దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల డయాబెటిస్ సమస్య దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది.