పేదలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.32,849 సహాయం పొందవచ్చట!

money4-getty

గత కొన్నేళ్లలో సోషల్ మీడియా యాప్స్ వినియోగం ఊహించని స్థాయిలో పెరిగింది. కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వస్తుండటంతో ఏ యాప్ ను ఉపయోగించాలో ఏ యాప్ ను ఉపయోగించకూడదో అర్థం కావడం లేదు. అదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్ ను గుర్తించడం కష్టమవుతోంది. కొన్ని వార్తలు అచ్చం నిజమైన వార్తలను తలపించే విధంగా ఉండటం గమానార్హం.

ఈ మధ్య కాలంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ.32,849 సహాయం చేస్తోందని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు నిజమని నమ్మితే మాత్రం భారీ స్థాయిలో నష్టపోక తప్పదు. కేంద్రం ఏ పథకాన్ని అమలు చేసినా అధికారికంగా బ్యాంకులలో నగదు జమయ్యేలా పథకాలను అమలు చేయడం జరుగుతుంది. కేంద్రం అమలు చేసే పథకాలకు సంబంధించిన వివరాలు ప్రభుత్వ వెబ్ సైట్లలో ఉంటాయి.

కొంతమంది కేటుగాళ్లు అమాయక ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో అమలు చేయని పథకాలను సైతం అమలు చేస్తున్నట్టు వార్తలను ప్రచారం చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ పథకాల గురించి, వాటి అమలు గురించి ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలో ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫేక్ పథకాల విషయంలో ఒకింత జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు.

ఎలాంటి అర్హత లేకుండా కేంద్రం డబ్బులను జమ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. పప్పూబెల్లాలలా డబ్బులను అనర్హులకు పంచే అవకాశం లేదు. పథకాలు ఇస్తామని ఎవరైనా ఫోన్ కాల్స్ చేస్తే మాత్రం నమ్మకుండా ఉంటే మంచిది.