సమంతకు ఆ వ్యక్తి అంటే అంత భయమా… తనని చూస్తే అంతలా భయపడుతుందా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న ఈమె వ్యక్తిగత జీవితాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. ఇలా సమంత వ్యక్తిగత జీవితంలో ఫెయిల్ అయిందని చెప్పాలి.ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి నుంచి విడిపోయి ప్రస్తుతం సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టిన సమంత తన తల్లితో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు.

ఈ క్రమంలోనే సమంత హైదరాబాదులో తన తల్లితో కలిసి నివసిస్తుందని వార్తలు వస్తున్నాయి.తనకు,తన తల్లికి మధ్య విభేదాలు వచ్చాయని తద్వారా తన తల్లి కూడా తనని వదిలి వెళ్లిపోయిందని తెలుస్తోంది. అయితే సమంతకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత తన జీవితంలో ఎంతో ధైర్యవంతురాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు కొనసాగుతుంది. ఇలాంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి సమంత జీవితంలో ఒకరికి మాత్రం భయపడుతుందని తెలుస్తోంది.

సమంత తన జీవితంలో తన తల్లికి ఎంతో భయపడుతుందని ఆమె ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటుందని తెలుస్తోంది.ఇక సమంతతోపాటు తన తల్లి కూడా ఉన్నారని తెలిస్తే సమంత స్నేహితులు ఎవరూ కూడా తన ఇంటి దరిదాపులలోకి వెళ్లడానికి కూడా సాహసం చేయరని సమాచారం.ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో కచ్చితంగా ఉండటం వల్ల సమంత కూడా తన తల్లికి భయపడుతుందని తెలుస్తోంది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె యశోద, ఖుషి వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.