చనిపోవటానికి ముందు పూజలు చేసిన కృష్ణంరాజు..? వీడియో వైరల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల అనారోగ్య కారణాల తో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. పోస్ట్ కోవిడ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన కృష్ణంరాజు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు. కృష్ణంరాజు మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే కొంతమంది మాత్రం కృష్ణంరాజు మరణించిన తర్వాత ఆయన గురించి అనేక రకాల పుకార్లు పుట్టిస్తున్నారు.

ఇక ఇటీవల కూడా కృష్ణంరాజు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణంరాజు చనిపోవటానికి ఒకరోజు ముందు పూజలు చేసినట్లు అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే కొందరు
నెటిజన్స్ మాత్రం ఇవన్నీ కృష్ణంరాజు గురించి వస్తున్న పుకార్లు అంటూ కొట్టి పారేస్తున్నారు. దాదాపు నెలరోజుల పాటు హాస్పిటల్ లో వెంటిలేటర్ మీద చికిత్స తీసుకున్న కృష్ణంరాజు ఎలా పూజలు చేస్తారు అంటూ మండిపడుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో రెండు సంవత్సరాల క్రితం కృష్ణంరాజు చేసిన పూజకు సంబంధించిన వీడియో అంటూ కృష్ణంరాజు సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన కృష్ణంరాజు గురించి ఇలాంటి వార్తలు ప్రచారం చేయటంతో ఆయన అభిమానులతో పాటు సన్నిహితులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన మరణించడం వల్ల అతని కుటుంబ సభ్యులు బాధలో మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు కృష్ణంరాజు గురించి ఇలాంటి వార్తలు వారిని మరింత కలిచి వేస్తాయని ఆయన సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.