మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో కొవ్వుగడ్డల సమస్య ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొంతమందిలో వయస్సుతో సంబంధం లేకుండా ఈ కొవ్వుగడ్డలు కనిపిస్తాయి. చర్మం, కొండరం పొరకు మధ్య ఏర్పడే ఈ గడ్డలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఈ గడ్డలు శరీరంపై ఎందుకు వచ్చాయో కచ్చితమైన కారణాలు చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.
కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా ఈ కొవ్వుగడ్డలు వచ్చే అవకాశం అయితే ఉంది. కొంతమంది ఈ గడ్డలు క్యాన్సర్ గడ్డలు అని భయాందోళనకు గురవుతూ ఉంటారు. అయితే వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ కొవ్వుగడ్డల వల్ల శరీరానికి ఎలాంటి హాని కలగదు. వేలితో నొక్కితే ఈ కొవ్వు గడ్డలు కదులుతూ ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో ఈ కొవ్వుగడ్డలు పట్టుకుంటే జారిపోతుంటాయి. ముఖం, మెడపై ఈ కొవ్వుగడ్డలు ఏర్పడి శరీరానికి హాని చేసే అవకాశాలు అయితే ఉంటాయి. వీటిని పట్టించుకోకుండా అలాగే వదిలేసినా శరీరానికి ఎలాంటి నష్టం కలగదు. చర్మ నిపుణులను సంప్రదించడం ద్వారా కూడా ఈ సమస్యకు చెప్పవచ్చు. పచ్చి పసుపును అప్లై చేయడం ద్వారా ఈ గడ్డలను కరిగించే ఛాన్స్ అయితే ఉంటుంది.
లవంగాలను పొడిగా చేసి అందులో ఆవనూనె కలిపి కొవ్వుగడ్డల మీద అప్లై చేయడం ద్వారా మేలు చేకూరుతుంది. క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటిస్తే మంచిది. కాటన్ క్లాత్ తో వీటిని చుట్టి ఉంచితే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈ చిట్కాలు పాటించినా సమస్య పరిష్కారం కాకపోతే వైద్యుల సలహాలు సూచనలు తీసుకుంటే మంచిది.