మరమరాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. హైబీపీతో పాటు ఆ సమస్యలకు చెక్!

మనలో చాలామంది మరమరాలతో చేసిన వంటలు తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మరమరాలతో చేసే వుగ్గాని రుచిగా ఉండటంతో పాటు రాయలసీమలో ఎక్కువమంది తినే వంటకాలలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. మరమరాలతో చేసే భేల్ పూరి ఎంతో రుచిగా ఉంటుంది. మరమరాలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సులువుగా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఎముకలు దృఢంగా ఉంచేలా చేయడంలో మరమరాలు సహాయపడతాయి. మరమరాల ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ బి, విటమిన్ డి లభిస్తాయి. మరమరాలు తీసుకోవడం ద్వారా ఎముకలు, దంతాలు సైతం దృఢంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆస్టియోపొరోసిస్‌ ముప్పును తగ్గించడంలో మరమరాలు సహాయపడతాయి. ఎముకలు విరిగిన వాళ్లు డైట్ లో మరమరాలను భాగం చేసుకుంటే మంచిది.

బరువు తగ్గించడంలో మరమరాలు ఎంతగానో సహాయపడతాయి. క్యాలరీలు తక్కువగా ఉండే మరమరాలను తీసుకోవడం ద్వారా కడుపు నిండుగా ఉండటంతో పాటు ఆకలి నియంత్రణలో ఉంటుంది. స్నాక్స్ టైమ్ లో మరమరాలను తీసుకోవడం ద్వారా ఎన్నో లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంలో మరమరాలు తోడ్పడతాయని చెప్పవచ్చు.

మరమరాలను ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా హైపర్ టెన్షన్ కంట్రోల్ లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరమరాల్లో సోడియం తక్కువగా ఉండటం వల్ల బీపీ సులువుగా కంట్రోల్ లో ఉంటుందని చెప్పవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడం మరమరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. పిల్లలకు మరమరాలు బెస్ట్ స్నాక్స్ అని చెప్పవచ్చు. మధుమేహం ఉన్నవాళ్లు మరమరాలకు దూరంగా ఉంటే మంచిది.