వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కువమందిని వేధించే ఆరోగ్య సమస్యలలో విరేచనాల సమస్య ఒకటి కాగా ఈ సమస్య వల్ల ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడి ఉంటారు. తీసుకునే ఆహారంలో ఏమాత్రం మార్పు వచ్చినా విరేచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ట్యాబ్లెట్ వేసుకున్నా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోకపోతే ఈ సమస్య కొన్నిసార్లు తగ్గదు.
కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. తురిమిన అల్లం, దాల్చిన చెక్క పొడిని వేడినీటిలో మరిగించి ఆ మిశ్రమాన్ని తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. తేనె, దాల్చిన చెక్క మిశ్రమం తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. గడ్డ పెరుగు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి. రోజుకు 2 నుంచి మూడుసార్లు గడ్డపెరుగు తీసుకుంటే మంచిది.
పెరుగులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ విరేచనాల సమస్యకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. ప్రతి 2 గంటలకు ఒక సారి బాగా మగ్గిన అరటి పండును తినడం ద్వారా కూడా విరేచనాల సమస్యను దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎండిన అల్లం పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి కొద్దిగా, దాల్చిన చెక్క పొడి, తేనెలను కొంత మొత్తం కలిపి తీసుకుంటే కూడా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
వేసవికాలంలో ఎక్కువమందిని అతిసారం వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. కలుషితమైన నీరు, లేదా సరిపడని ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు అతిసారం వ్యాధికి కారణమవుతుంది. ఒత్తిడి, ఆందోళనలు, కొన్ని ఎలర్జీ కారకాలు కూడా విరేచనాలను కలిగించే అవకాశం ఉంటుంది.