ప్రస్తుత కాలంలో ప్రతి కుటుంబంలో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ద్వారావంట చేస్తున్నారు. వేగంగా తక్కువ సమయంలో వంట పూర్తవుతుందని భావిస్తే కోరి ఆరోగ్య సమస్యలను తెచ్చుకున్నట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను వినియోగిస్తే గంజిలోని పోషకాలు కూడా శరీరానికి లభిస్తాయని చాలామంది ఫీలవుతారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకు పెద్దగా కరెంట్ కూడా అవసరం లేదు.
అయితే అల్యూమినియం పాత్రలను వినియోగించడం వల్ల కొన్నిసార్లు క్యాన్సర్ లాంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నాసిరకం రైస్ కుక్కర్లను వాడితే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో వండిన ఆహారం తీసుకుంటే చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
పల్లెల్లో సైతం వీటి వినియోగం ఊహించని స్థాయిలో పెరిగింది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తినడం ద్వారా శరీరానికి పోషకాలు లభించవు. నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దని అవసరమైతే అన్నం వండటం కోసం ప్రెజర్ కుక్కర్లను వాడాలని వైద్యులు వెల్లడిస్తున్నారు. మట్టి పాత్రలో వండుకుని తినడం వల్ల మట్టిలోని పోషకాలు లభించే అవకాశాలు ఉంటాయి.
స్టీల్ పాత్రలలో వండుకుని తిన్నా ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగే అవకాశాలు అయితే ఉండవు. రైస్ కుక్కర్ లో అన్నం తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వినియోగిస్తే ఉదర సంబంద సమస్యలు, గుండె సంబందిత సమస్యలు, కీళ్ల వాతం, మధుమేహం, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.