నిల్వ పచ్చళ్లు ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వీటి వల్ల ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది నిల్వ పచ్చళ్లను తినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నిల్వ పచ్చళ్లు ఎంతో రుచికరంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. వేర్వేరు కూరగాయలు, పండ్లతో నిల్వ పచ్చళ్లను తయారు చేయడం జరుగుతుంది. ఆహారం రుచిని పెంచడంలో నిల్వ పచ్చళ్లు ఎంతగానో సహాయపడతాయని చెప్పవచ్చు. అయితే పచ్చళ్లలో ఉప్పు, నూనె, మసాలాలు ఒకింత ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే.

ఎవరైతే ఊరగాయలు ఎక్కువగా తింటారో వాళ్లను వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీపీ పేషంట్లు, గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడుతున్న వాళ్లకు ఈ పచ్చళ్లు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. పచ్చళ్ళలో అధిక మొత్తంలో ఉండే కారం, ఉప్పు, నూనె బ్లడ్ ప్రెషర్ ను పెంచుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

ఒకవేళ ప్రతిరోజూ నిల్వ పచ్చళ్లను తినాలని భావించే వాళ్లు మాత్రం పరిమితంగా వీటిని తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. మొలల సమస్యతో బాధ పడేవాళ్లు నిల్వ పచ్చళ్లను తింటే ఈ సమస్య మరింత తీవ్రం అవుతుంది. కారం, ఘాటు పదార్థాలు ఫైల్స్ సమస్యను మరింత తీవ్రపరిచే అవకాశాలు ఉంటాయని వైద్యులు సైతం వెల్లడిస్తున్నారు.

ఎవరైతే ఊరగాయలను ఎక్కువగా తీసుకుంటారో వాళ్లను అల్సర్ సమస్య సైతం వేధించే ఛాన్స్ ఉంటుంది. నిల్వ పచ్చడిలో అధిక మొత్తంలో ఉండే ఉప్పు, కారం, నూనె కారణంగా జీర్ణాశయ సమస్యలు వేధిస్తాయి. ఊరగాయలలో ఎక్కువగా ఉండే ఉప్పు వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పవచ్చు. ఊరగాయలు ఎక్కువగా తినే వారిలో ఉదరంలో నొప్పి, పిత్తాశయ సమస్యలు సైతం వచ్చే ఛాన్స్ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.