పైల్స్ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే!

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కువమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో పైల్స్ ఒకటి. జంక్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపేవాళ్లు ఎక్కువగా ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య మరింత తీవ్రమైతే ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి సైతం వస్తుంది. పీచు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా పైల్స్ సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

ఫ్రెష్ పండ్లు, వెజిటేబుల్స్ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా పైల్స్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎక్కువ మొత్తంలో నీరు తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. బరువు ఎక్కువగా ఉన్నవాళ్లను సైతం ఈ సమస్య వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. మలద్వారం వద్ద నొప్పి, రక్తస్రావం ఉంటే పైల్స్ బారిన పడ్డామని గుర్తించాలి. త్రిఫల చూర్ణం పొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

పాలలో ఆముదం నూనె కలిపి తీసుకుంటే మొలల పరిమాణం తగ్గుతుందని చెప్పవచ్చు. రాత్రిపూట పరిమితంగా భోజనం తీసుకుంటే మంచిది. కారాలు, మసాలాలు ఉన్న పదార్థాలు తీసుకోకుండా తేలికైన ఆహరాన్నే తీసుకోవడం ద్వారా శరీరానికి మేలు జరుగుతుంది. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం ద్వారా కూడా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

ప్రతిరోజూ సలాడ్లను తీసుకోవడం ద్వారా రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పవచ్చు. రోజువారీ ఆహారంలో ఇంగువను చేర్చుకోవడం ద్వారా మొలల సమస్యను దూరం చేసుకోవచ్చు. వైద్య చికిత్స తీసుకుంటూనే ఈ చిట్కాలను పాటించడం ద్వారా మొలల సమస్య సులువుగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.