ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రాడ్యుయేట్, డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 2023 సంవత్సరం డిసెంబర్ నెల 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 363 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
డిప్లొమా, బీఈ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. 2023 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంటుంది. మార్కులు, రిజర్వేషన్ల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2024 సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి అప్రెంటీస్ శిక్షణ మొదలుకానుంది. హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుంది.
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 250 ఉండగా డిప్లొమా, టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 113 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్ లకు 9000 రూపాయలు వేతనంగా లభించనుండగా మిగతా అభ్యర్థులకు 8000 రూపాయలు వేతనంగా లభించనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలుకాగా డిసెంబర్ 15వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. డిసెంబర్ 22వ తేదీన ధృవపత్రాల పరిశీలన జరగనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ప్రవేశ తేదీ 2023 సంవత్సరం డిసెంబర్ నెల 31వ తేదీగా ఉంది. https://www.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.