కారం ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. కారం వల్ల ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది కారంతో చేసిన వంటకాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. మన దేశంలో ఎక్కువ సంఖ్యలో సుగంధ ద్రవ్యాలు అందుబాటులో ఉన్నాయి. మోతాదుకు మించి కారం తీసుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదనే సంగతి తెలిసిందే. కారం ఎక్కువగా తినడం వల్ల ఎన్నో రోగాల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎర్ర మిరపపొడిని ఎక్కువగా తింటే డయేరియా బారిన పడే ఛాన్స్ ఉంటుంది.

కారం పొడి పొట్టలోపల అత్తుకుని కూడా సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కారం ఎక్కువగా తింటే విపరీతంగా విరేచనాలయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఎండు మిరపపొడిని ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు ఎక్కువగా వచ్చి ఎసిడిటీ బారిన పడే అవకాశాలు ఉంటాయి. కొంతమందికైతే కారం ఎక్కువగా తింటే గుండెలో మంట కలిగే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.

కారం మోతాదులో తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. మోతాదుకు మించి తింటే కడుపులో పుండు అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఈ కారం పేగులకు, కడుపునకు అత్తుకుని అల్సర్ కు దారి తీస్తుంది. బలహీనత, మూర్ఛ, మైకము మొదలగు వికారాలు రావడానికి కారం ఒక విధంగా కారణం అవుతుంది. కారంతో పాటు మసాలాలు ఎక్కువ తీసుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పవచ్చు.

లవంగాలు, మిరియాలు ఎక్కువగా వాడితే జీర్ణకోశ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కారం ఎక్కువగా తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. అతిగా కారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప ఎలాంటి లాభం అయితే ఉండదని చెప్పడంలో సందేహం అవసరం లేదు.