రెడ్ మీట్ ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. అలాంటి సమస్యలు వస్తాయా?

మనలో చాలామంది రెడ్ మీట్ ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. రెడ్ మీట్ పరిమితంగా తీసుకోవడం వల్ల శరీరానికి లాభం ఉన్నా ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం ఊహించని స్థాయిలో నష్టం చేకూరుతుంది. గొర్రెలు, జింకలు, పంది, మేక నుంచి లభించే రెడ్ మీట్ వల్ల శరీరానికి హాని కలుగుతుంది. రెడ్ మీట్ , ప్యాక్ చేసిన మాంసాలలో అమినో యాసిడ్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంపై చెడు ప్రభావం పడుతుంది.

రెడ్ మీట్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వారికి వాళ్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. గుండె జబ్బుల ప్రమాదాన్ని సైతం రెడ్ మీట్ పెంచుతుంది. రెడ్ మీట్ తినడం వల్ల శరీరంలో అనవసరమైన కొవ్వు నిల్వ ఉండే అవకాశం ఉంది. బరువు పెరగడంతోపాటు అనేక ఇతర సమస్యలకు రెడ్ మీట్ కారణమవుతుంది. క్రొవ్వు ఎక్కువగా ఉండే రెడ్ మీట్ జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది.

జీర్ణక్రియ సమస్యల వల్ల అజీర్తి, మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. రెడ్ మీట్ , ప్యాక్ చేసిన మాంసాన్ని తక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. మాంసం తినే అలవాటు పిల్లలకు సైతం మంచిది కాదు. మాంసం తినడం వల్ల దీర్ఘకాలంలో కలిగే నష్టాలు అన్నీఇన్నీ కావు.

మాంసాహారం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. చికెన్, మటన్ తినేవాళ్లు సైతం ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. మాంసాహారం తినేవాళ్లు మాంసాహారం తినడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుని ఆహారం తినే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.