పుల్కా, చపాతీలను డైరెక్ట్ గా గ్యాస్ పై కాల్చేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఏకంగా ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది పుల్కా, చపాతీలను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. పుల్కా, చపాతీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే కొంతమంది వీటిని ఎలాంటి వస్తువుల సహాయం లేకుండా డైరెక్ట్ గా గ్యాస్ పై కాలుస్తున్నారు. అయితే ఇలా కాల్చడం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువని వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.

ఈ విధంగా చేసిన పుల్కాలు, చపాతీలు తింటే శరీరంపై నెగిటివ్ ప్రభావం పడుతుందని గుర్తు పెట్టుకోవాలి. గ్యాస్ పై డైరెక్ట్ గా కాల్చడం వల్ల చపాతీలు, పుల్కాలను వేగంగా తయారు చేయవచ్చు తప్ప అంతకు మించి ఎలాంటి ప్రయోజనం పొందలేము. గ్యాస్ స్టవ్ లు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లను విడుదలచేయడం జరుగుతుంది. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

ఎక్కువ మంటపై చేసిన వంటకాలను తినడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. ఇప్పటివరకు చేసిన పొరపాట్లను ఇకపై రిపీట్ చేయకుండా ఉంటే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చపాతీలు బరువు తగ్గేలా చేయడంతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి.

పాన్ లేకుండా వంటకాలను తయారు చేసుకుని తింటే కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. డైరెక్ట్ గా కాల్చిన చికెన్ వంటకాలను తినడం ద్వారా కూడా ఆరోగ్యానికి కలిగే నష్టం అంతాఇంతా కాదు. చికెన్, మటన్ వంటకాలను తరచూ తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.