పిజ్జా ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యుస్.. పిజ్జా ఎక్కువగా తినడం వల్ల ఇంత నష్టమా?

మనలో చాలామంది పిజ్జా ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. పిజ్జా తినడానికి ఎంతో రుచిగా ఉండటం వల్ల వీటిని తినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. అయితే మోతాదుకు మించి పిజ్జా తినడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువనే సంగతి తెలిసిందే. పిజ్జా, బర్గర్ వల్ల శరీరానికి కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. పిజ్జా అతిగా తినడం వల్ల మధుమేహం వచ్చే ఛాన్స్ ఉంటుంది.

రిపైండ్ కార్బోహైడ్రేట్లు బ్లడ్ షుగర్ స్థాయిని అకస్మాత్తుగా పెంచే అవకాశాలు అయితే ఉంటాయి. మధుమేహంతో బాధ పడేవాళ్లకు పిజ్జా విషంతో సమానమని చెప్పవచ్చు. పిజ్జా ఎక్కువగా తినడం వల్ల కొన్నిసార్లు గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కార్డియోవాస్క్యులర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించడంతో పాటు హైపర్ టెన్షన్ సమస్యకు పిజ్జా కారణమవుతుందని చెప్పవచ్చు.

పిజ్జా ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయం బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. పిజ్జా తీసుకోవడం వల్ల నడుము చుట్టూ కొవ్వు పెరిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. పిజ్జాలో ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల నష్టం కలిగే ఛాన్స్ ఉంటుంది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం, బ్లోటింగ్ లాంటి సమస్యలకు పిజ్జా కారణమవుతుందని చెప్పవచ్చు. తరచూ పిజ్జా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

చీజీగా, టేస్టీగా ఉండే పిజ్జా కడుపు, ప్రేగు క్యాన్సర్లకు కూడా కారణమై విపరీతమైన బరువుకు కారణమవుతుందని చెప్పవచ్చు. ఇతర సమస్యలను తగ్గించడంలో పిజ్జా ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. పిజ్జాలను తరచూ తినేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.